Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.
దీంతో ఐదుగురు భారత సైనికులు మరణించారు. ఇద్దరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు.
బ్లైండ్ కర్వ్, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఈ సమయంలో ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించడంతో పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రదేశాన్ని ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఉగ్రవాదులు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఉన్న కొండపై నుంచి వాహనాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
details
పీఏఎఫ్ఎఫ్ సంస్థదే బాధ్యత అని ప్రకటన
అయితే ఈ ఆకస్మిక దాడిలో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు.
దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు.
ఈ ఘటనకు పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) బాధ్యత ప్రకటించింది.
M4 కార్బైన్, 1980ల్లో అమెరికాలో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్'ను అమెరికా సాయుధ దళాల ఆయుధంగా పిలుస్తారు.
ప్రస్తుతం దీన్ని 80కిపైగా దేశాల్లో వినియోస్తున్నారు.ఇదే సమయంలో పలు తీవ్రవాద సంస్థలు సైతం ఈ ఆయుధాన్ని అక్రమంగా వాడుతున్నాయి.
ఆర్టికల్370 రద్దు తర్వాత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు అలజడి సృష్టించేందుకు కుట్రచేస్తున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.