Guwahati : భారీ వర్షం కారణంగా గౌహతి విమానాశ్రయంలో కూలిన సీలింగ్ భాగం.. విమానాలు దారి మళ్లింపు
అస్సాంలోని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్‌లో ఒక భాగం ఆదివారం భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కానప్పటికీ, సీలింగ్‌లో ఒక భాగం కూలిపోవడంతో అదానీ గ్రూప్ నియంత్రణలో ఉన్న విమానాశ్రయం అధికారులు కొద్దిసేపు కార్యకలాపాలను నిలిపివేసి, ఆరు విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన వీడియో, సీలింగ్ లోని ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో , ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది పరిగెత్తడం చూడచ్చు . ఇతర వీడియోలలో విమానాశ్రయ సిబ్బంది ప్రాంగణంలోని అదనపు నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
దృశ్యమానత మెరుగుపడటంతో, కార్యకలాపాలు పునఃప్రారంభం
విమానాశ్రయం వెలుపల ఉన్న ఆయిల్ ఇండియా కాంప్లెక్స్‌లో తుఫానుతో పెద్ద వృక్షం కూలి పోయి రోడ్డుకి అడ్డం పడిందని చీఫ్ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్ (CAO) ఉత్పల్ బారుహ్ వార్తా సంస్థ PTIకి తెలిపారు. మరోవైపు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్న విమానాలను అగర్తల, కోల్‌కతాకు మళ్లించారు. అయితే, తర్వాత దృశ్యమానత మెరుగుపడటంతో, కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. గౌహతి విమానాశ్రయంలో విమానాలు ల్యాండింగ్ కూడా ప్రారంభమయ్యింది.