
Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
ప్రజాపాలన దరఖాస్తులను పరిష్కరించి, అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
కేబినెట్ సబ్‌కమిటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చీఫ్‌గా ఉంటారు.
మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై సోమవారం సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సబ్ కమిటీ ఛైర్మన్‌గా భట్టి
ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2024
డిప్యూటీ సీఎం భట్టి ఛైర్మన్‌గా సబ్‌కమిటీ
కమిటీ సభ్యులుగా శ్రీధర్‌బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్#PonguletiSrinivasaReddy #PrajaPalana #SixGuarantees #SixGuaranteesApplication #Telangana #telanganaprajaprabhutwam #RevanthReddy… pic.twitter.com/Be16XgQ5DI