తదుపరి వార్తా కథనం

Prajwal Revanna-Sex Scandal-Suspended: దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ నుంచి సస్పెండ్
వ్రాసిన వారు
Stalin
Apr 30, 2024
02:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
సెక్స్ వీడియోలు(Sex Videos)చిక్కుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)ను జేడీఎస్(JDS)పార్టీ సస్పెండ్ చేసింది.
సస్పెండ్ చేయడంతో పాటు అతనికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ స్పష్టంగా ఉన్న ఆ వీడియోలు నియోజకవర్గం లో బాగా వైరల్ అయ్యాయి.
ఈ ఘటన అనంతరం ప్రజ్వల్ పై ఒక మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదును పోలీసులకు అందజేసింది.
2019 నుంచి 2022వరకు తనను అనేకసార్లు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
దీంతోపాటు తన కుమార్తె పట్ల కూడా అశ్లీలంగా ఫోన్లో మాట్లాడారని పేర్కొంది.
దీంతో ఎంపీ ప్రజ్వల రేవణ్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.