Page Loader
Prayagraj :కుర్చీ కోసం గొడవపడిన కొత్త, పాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు.. వైరల్ అవుతున్న వీడియో  
కుర్చీ కోసం గొడవపడిన కొత్త, పాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు

Prayagraj :కుర్చీ కోసం గొడవపడిన కొత్త, పాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు.. వైరల్ అవుతున్న వీడియో  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 05, 2024
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి కుర్చీపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ దుమారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. అదే సమయంలో, వ్యవస్థను మార్చే ఈ పద్ధతిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసు బిషప్ జాన్సన్ బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించినది. ఈ పాఠశాల లక్నో డియోసెస్ (చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ పాఠశాలలో, మంగళవారం, మోరిస్ ఎడ్గార్ డాన్ తన మద్దతుదారులతో కలిసి ప్రిన్సిపాల్ ఛాంబర్‌లోకి బలవంతంగా ప్రవేశించి ఏకపక్షంగా కొత్త ప్రిన్సిపాల్‌గ అక్కడ బాధ్యతలు స్వీకరించారు.

వివరాలు 

ఈ ఘటనపై మాజీ ప్రిన్సిపాల్‌ తన వాదనను వినిపించారు 

ఆ తర్వాత ఆయన మద్దతుదారులు ప్రస్తుత ప్రిన్సిపాల్‌ను కుర్చీలోంచి బలవంతంగా దించడం ప్రారంభించారు.అలాగే ప్రస్తుత ప్రిన్సిపాల్‌ను మాజీ ప్రిన్సిపాల్‌గా మార్చారు. ఈ సంఘటనకు సంబంధించి, పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిషప్ మోరిస్ ఎడ్గార్ డాన్ , అనేక మంది వ్యక్తులు దోపిడీ, బెదిరింపు, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ పీఠాన్ని మాజీ బిషప్‌ పీటర్‌ బల్‌దేవ్‌ కుమార్తె పరుల్‌ సోలమన్‌ ఆక్రమించారు. ఈ ఘటనపై పరుల్ మాట్లాడుతూ.. 'పాఠశాల నిర్వహణకు సంబంధించిన అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.

వివరాలు 

 సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఘర్షణ 

పరుల్ ఇంకా మాట్లాడుతూ 'మంగళవారం ఉదయం స్కూల్‌లోని నా ఛాంబర్‌లో కూర్చున్నాను. ఈ సమయంలో కొందరు వ్యక్తులు లోపలికి వచ్చి వీరంగం సృష్టించారు. అన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అలన్ డాన్, మోరిస్ డాన్, వినీతా ఇసుబియస్, సంజీత్ పాల్, విశాల్ నోవెల్ సింగ్, ఆర్‌కె సింగ్, అరుణ్ మోజ్, తను వ్యాస్, అభిషేక్ వ్యాస్, మరి కొంతమంది తెలియని వ్యక్తులు రభస సృష్టించిన వారిలో ఉన్నారు. వారందరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాలు 

పరుల్ పై బిషప్ మోరిస్ ఎడ్గార్ డాన్ ఆరోపణలు  

ఈ విషయమై బిషప్ మోరిస్ ఎడ్గార్ డాన్ పారుల్‌పై పలు ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ "మాజీ బిషప్ పీటర్ బల్దేవ్ తన కుమార్తె పరుల్‌ను తప్పుగా ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా చేశారు. కాబట్టి నేను దానిని తోసిపుచ్చాను. అయితే ఇప్పటికీ ఆమె ఈ పదవికి రాజీనామా చేయలేదు. ఆమె పాఠశాల డబ్బును కూడా దుర్వినియోగం చేసింది. నేనెప్పుడు స్కూల్‌లో కలవడానికి వెళ్లినా ఆమె దాక్కునేది. పరుల్ స్థానంలో, మేము పాఠశాల కొత్త ప్రిన్సిపాల్‌గా షిర్లీ మాసిహ్‌ను నియమించాము" అని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..