LOADING...
Partnership Summit: విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్‌కు కీలక బాధ్యతలు
విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్‌కు కీలక బాధ్యతలు

Partnership Summit: విశాఖలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు సన్నాహాలు ప్రారంభం.. మంత్రి లోకేశ్‌కు కీలక బాధ్యతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక చర్యలు చేపట్టుతోంది. ఈ దిశగా ముందడుగు వేస్తూ విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో "పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్" నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ స్థాయిలో విభిన్న కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరుగురు మంత్రులతో కూడిన సమితిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Details

చైర్మన్ గా వ్యవహరించనున్న లోకేశ్

ఈ కమిటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మిగిలిన సభ్యులుగా టీజీ భరత్‌, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేశ్‌, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సమ్మిట్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వసతుల కల్పన, కార్యాచరణ నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారిస్తూ మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. పారిశ్రామికాభివృద్ధికి మెరుగైన వేదికగా ఈ సమ్మిట్ నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.