Bharat Ratna: భారతరత్న అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి
ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మరణాంతరం ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని అయన కుమారుడు పివి ప్రభాకర్ రావు స్వీకరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, మాజీ సీఎం చౌదరి చరణ్ సింగ్ పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన తనయుడు రామ్‌నాథ్,చరణ్ సింగ్ తరఫున మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున కూతురు నిత్యారావు అవార్డులను స్వీకరించారు. బీజేపీ అగ్రనేత అద్వానీకి మాత్రం ఆదివారం ఇంటికి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానం చేయనున్నారు.