ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు భారత్‌ను స్థాయిని మరింత పెంచుతాయ్: రాష్ట్రపతి ముర్ము
ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచడమే కాకుండా, పరిశోధనలకు ఊతమివ్వడంతో పాటు మానవాళికి కూడా సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ ఇన్ 2047' అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌తో పాటు జరిగే ఎగ్జిబిషన్‍ను శనివారం రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడారు. దేశం సుదీర్ఘ ప్రగతి సాధించినప్పటికీ, అనేక సవాళ్లు ఇంకా ఉన్నాయన్నారు. రక్షణ అవసరాలు, ఎయిర్ మొబిలిటీ, రవాణా కోసం స్పీడ్, రన్‌వే-స్వతంత్ర సాంకేతికతలను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏరోస్పేస్ రంగంలో మానవ వనరులను మెరుగుపరచడం, నైపుణ్యం పెంచడం అవసరమని నొక్కి చెప్పారు.