LOADING...
Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు..  ఎకరా రూ.137 కోట్లు  
కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు

Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు..  ఎకరా రూ.137 కోట్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేట భూభాగం మరోసారి రికార్డు స్థాయి ధరలకు చేరింది. ఇక్కడ ఎకరం భూమి ధర గరిష్టంగా రూ.137.25 కోట్లను తాకింది. నియోపోలిస్‌ ప్రాంతంలోని సర్వే నంబర్లు 17, 18లకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించగా, సర్వే నంబర్‌ 17లోని భూమి ఎకరానికి ఈ అత్యధిక ధర లభించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న విలువైన భూములను ఆన్‌లైన్‌ వేలంపాట ద్వారా విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

వివరాలు 

వేలానికి నియోపోలిస్‌లోని సర్వే నంబర్లు 17, 18

ఇటీవలి రోజుల్లో రాయదుర్గంలో 7.67 ఎకరాలను టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఒక సంస్థ రూ.1,357 కోట్లకు సొంతం చేసుకుంది. అక్కడ ఎకరాకు కనీస ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించగా, బిడ్డింగ్‌లో అది రూ.177 కోట్ల వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో కోకాపేట నియోపోలిస్‌లోని సర్వే నంబర్లు 17, 18లో ఉన్న భూములను హెచ్‌ఎండీఏ తాజాగా వేలం పెట్టింది. ఇక్కడ ఎకరా కనీస ధరను రూ.99 కోట్లుగా నిర్ణయించగా, వేలంపాటలో గరిష్టంగా రూ.137.25 కోట్లు నమోదు అయ్యాయి.