గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
ఆగస్టు నుంచి ఇంధన ధరలు తగ్గనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నవంబర్, డిసెంబర్‌లో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ తగ్గింపుపై కేంద్రం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో ధరలు తగ్గించాలని చమురు మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీ)ను కేంద్రం కోరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ పరిశోధన తేల్చింది.
ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 4-5 తగ్గించవచ్చని పేర్కొంది.
ఆ సమయంలో ముడి చమురు ధర, డాలర్‌తో రూపాయి విలువను బట్టి పెట్రోల్, డీజిల్ రేట్లను ఎంత తగ్గిస్తారనే విషయం తెలుస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాహనాదారులకు శుభవార్త
Good news! Petrol, diesel prices to come down soon | Here is WHY https://t.co/vM3x7iY6ov https://t.co/vM3x7iY6ov
— Realtimeindia (@Realtime_india) June 23, 2023