LOADING...
G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి! 
టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి!

G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. మూడ్రోజులు పాటు జరిగే ఈ జీ20 సమ్మిట్‌లో భారత్ తరఫున కీలక అభిప్రాయాలను ప్రపంచ నాయకులతో పంచుకోనున్నారు. అదేవిధంగా వివిధ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఇటీవల జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన 'సనే తకైచి'తో పాటు పలువురు ప్రముఖ నాయకులను కూడా మోడీ కలవనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిన్‌టెక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తున్న లీడర్లతో ఆయన ఆత్మీయంగా మాట్లాడారు.

Details

భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలి

భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, భారత ప్రజలతో దగ్గరగా పనిచేయాలని టెక్ దిగ్గజాలకు మోడీ పిలుపునిచ్చారు. అదే రోజు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయ సమాజంతో కూడా మోడీ సందడి చేశారు. వారు తమ అనుభవాలను మోడీతో పంచుకోగా, భారతదేశం వివిధ రంగాల్లో సాధించిన వేగవంతమైన పురోగతిని ప్రధాని అభినందించారు. ప్రత్యేకంగా యోగా, ఆయుర్వేదం వంటి భారతీయ అభ్యాసాలను దక్షిణాఫ్రికా ప్రజల్లో ఇంకా విస్తృతంగా ప్రాచుర్యం పొందేలా చేయాలన్న అభిలాషను మోదీ వ్యక్తం చేశారు.