Loading...
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. ఏమన్నారంటే?
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. ఏమన్నారంటే?

CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. ఏమన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా ఆయనకు పుట్టినరోజు విషెస్ చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సైతం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు సహా పలువురు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వివరాలు

ఎక్స్‌లో మోదీ సందేశం

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రత్యేక పోస్టు చేశారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

వివరాలు

రేవంత్ రెడ్డికి ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారు.

ప్రస్తుతం దేశం అమృత్ కాలంలో ఉందని, వేగంగా అభివృద్ధి, సమగ్రత వైపు అడుగులు వేస్తోందని అందులో ప్రస్తావించారు.

ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి తనవంతు కృషిని కొనసాగిస్తారని నమ్ముతున్నట్లు ప్రధాని తన లేఖలో ఆకాంక్షించారు.

ADVERTISEMENT