సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఐటీ సిటీ హైదరాబాద్- దివ్య క్షేత్రం తిరుపతిని కలిపే ఈ సెమీ హైస్పీడ్ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది.
ఇది అందుబాటులోకి రావడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికులు ప్రయోజనం పొందుతారు.
తిరుమల వేంకటేశ్వర దేవాలయం ఉన్న తిరుపతిని కలిపే భారతదేశంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం గమనార్హం.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో 13వది కావడం గమనార్హం.
ఐటీ సిటీ హైదరాబాద్‌ను తిరుపతితో కలుపుతుంది. మూడు నెలల్లో తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో వందే భారత్ రైలు ఇది.
మోదీ
రూ.11,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన
హైదరాబాద్ పర్యటనలో భాగంగా మోదీ రూ.11,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపనతో పాటు రైల్వేలకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తొలుత హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పార్టీ చీఫ్ చీఫ్ బండి సంజయ్ స్వాగతం పలికారు.
ఈ సారి కూడా ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వాగతం పలికేందుకు రాలేదు.
కేసీఆర్ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోదీకి స్వాగతం పలికారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెండా ఊపి వందేభారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ
#WATCH | Telangana | PM Narendra Modi flags off Vande Bharat Express between Secunderabad and Tirupati.
— ANI (@ANI) April 8, 2023
It will reduce the travel time between the two cities by almost three and a half hours. pic.twitter.com/UCMd6yuWqC