Page Loader
రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత
రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత

రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత

వ్రాసిన వారు Stalin
Apr 07, 2023
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రానున్న నేపథ్యంలో అధికారులు శనివారం ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 10పై ప్రయాణికుల రాకపోకలు, టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ స్టాల్స్, వెయిటింగ్ హాల్స్ వంటి సౌకర్యాలను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్

ఆంక్షలు శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి: అధికారులు

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఆ సమయంలో మూసివేయబడుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.