Page Loader
గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 
గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
May 12, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి, నీటి సరఫరా, రోడ్డు, రవాణా, గనులు, ఖనిజాల శాఖల కింద చేపట్టిన పలు పనులను ప్రధాని మోదీ ప్రారంభించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకాల పెంపుదల, అహ్మదాబాద్‌లో ఓవర్‌బ్రిడ్జి, నరోడా జీఐడీసీలో డ్రైనేజీ సేకరణ నెట్‌వర్క్, మెహసానా, అహ్మదాబాద్‌లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, దహెగామ్‌లో ఒక ఆడిటోరియం పనులను ప్రధాని ప్రారంభించారు.

మోదీ

పీఎంఏవై కింద 19వేల ఇళ్ల నిర్మాణం- తాళాలు అందజేసిన మోదీ

జునాగఢ్ జిల్లాలో బల్క్ పైప్‌లైన్ ప్రాజెక్టులు, గాంధీనగర్ జిల్లాలో నీటి సరఫరా పథకాల పెంపుదల, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, కొత్త నీటి పంపిణీ స్టేషన్లు, వివిధ టౌన్ ప్లానింగ్ రోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద నిర్మించిన సుమారు 19,000 ఇళ్ల సామూహిక గృహ ప్రవేశం కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు కీలను అందజేశారు. దాదాపు రూ.1950 కోట్లతో పీఎంఏవై ఇళ్లను చేపట్టారు. అంతకుముందు రోజు, ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్ ఫెడరేషన్ - అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ 29వ ద్వైవార్షిక సదస్సులో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు.