Narendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా ప్రారంభమైన ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్లు అత్యధికంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 120 ట్రిప్పుల ద్వారా వందే భారత్ రైళ్లు రోజూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొంది.
రూ.660 కోట్ల నిధుల మంజూరు
ప్రధాని మోదీ వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని జాతికి అంకితం చేశారు. ఝార్ఖండ్‌లోని టాటానగర్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ లబ్ధిదారుల కోసం రూ.660 కోట్ల నిధులు 20,000 మందికి మంజూరు చేశారు.