Page Loader
PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్: ప్రధాని మోదీ 
PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్: ప్రధాని మోదీ

PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్: ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Mar 16, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత పదేళ్లలో తెలంగాణ అభివృద్దికి ఎన్డీఏ సర్కారు కృషి చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నాగర్‌ కర్నూల్‌ లో శనివారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని స్పష్ట పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ధ్వంసం చేశాయన్నారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలో అక్కడి ప్రజల నుంచి అద్భుత స్పందన చూసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభివృద్దికి ఇన్నాళ్లు అడ్డంకిగా మారాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గత ఏడు దశాబ్దాల్లో దేశాన్ని దోచుకోవటం తప్పా.. ఏం చేయలేదన్నారు.

మోదీ

తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలిపించాలి: మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ మెజారిటీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమే అని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లలో గెలవబోతుందని మోదీ జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా 87 లక్షల మంది ప్రజలు ఆయుష్మాన్‌ భారత్‌ కింద లబ్ది పొందినట్లు మోదీ వెల్లడించారు. దేశంలో బీజేపీ మాత్రమే సామాజిక న్యాయం చేసినట్లు వివరించారు. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ పార్టీ దళితులను మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగినట్లు మోదీ వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న ప్రధాని మోదీ