Page Loader
PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస
తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస

PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్' కార్యక్రమంలో 117వ ఎపిసోడ్‌లో పలు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆయన ప్రశంసలు కురిపించారు. నాగేశ్వరరావు తెలుగు సినిమాకు చేసిన మహోన్నత కృషిని ఆయన ప్రశంసించారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చక్కగా ప్రతిబింబించారని అన్నారు. అలాగే బాలీవుడ్‌ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్‌ను కూడా గుర్తుచేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతీయ చలనచిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని తెలిపారు.

Details

కుంభ మేళా సమయంలో భక్తుల కోసం డిజిటల్ నావిగేషన్

వచ్చే ఏడాది ప్రపంచంలోని ప్రముఖ మీడియా, వినోద రంగ నేతలతో వరల్డ్ ఆడియో-విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రాజ్యాంగం 75 ఏళ్ల పుర్తీ సందర్భంగా, ప్రధాని భారతదేశ రాజ్యాంగం ఆమోదానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాలను వీడియోల రూపంలో పంచుకోవాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల సందర్భంగా ప్రజలను ఈ ప్రచారంలో భాగస్వామి కావాలని కోరారు. జనవరి 13న ప్రారంభమయ్యే మహాకుంభ మేళాను ఐక్యతా మేళాగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం కోసం భక్తులకు ఏఐ చాట్‌బాట్‌లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. కుంభ మేళా సమయంలో భక్తుల కోసం డిజిటల్ నావిగేషన్, ఐ-ఎల్ ఆధారిత కెమెరాలు, రోబోటిక్ ఫైర్ టెండర్లు వినియోగిస్తామని వెల్లడించారు.