
PM Modi: గుల్జార్‌హౌస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంటల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని మోదీ తెలిపారు.
దుర్ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు.
Details
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు నాయుడు
ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌లోని ఓ భవనపు మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం మొత్తాన్ని మంటలు చుట్టేసాయి.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిలో కొందరిని రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.