Page Loader
కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
May 28, 2023
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవానికి ముందు, ప్రధానమంత్రి భవన నిర్మాణ కార్మికులను సంప్రదాయ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ పూజలు చేసిన తర్వాత స్పీకర్ కుర్చీ పక్కనే కొత్త లోక్‌సభ ఛాంబర్‌లో పవిత్రమైన 'సెంగోల్'ను ప్రతిష్ఠించారు. కొత్త పార్లమెంట్ భవనంలో అమృత్ కాల్ చిహ్నంగా 'సెంగోల్'ను ప్రతిష్ఠించారు. 'సెంగోల్' ప్రతిష్టాపన అనంతరం ప్రధానమంత్రి తమిళనాడుకు చెందిన మఠాధిపతుల ఆశీర్వాదాలను పొందారు. ఇదే సెంగోల్‌ను భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆగస్టు 14వ తేదీ రాత్రి తన నివాసంలో బ్రిటిషర్స్ నుంచి స్వీకరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సింగోల్‌ను ప్రతిష్ఠించిన ప్రధాని మోదీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ