LOADING...
PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 
రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయిలాండ్‌ (Thailand) పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన కోసం ఈరోజు థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ (Bangkok) చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్ర (Paetongtarn Shinawatra) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటనను నిర్వహిస్తున్నారు. ఇవాళ, రేపు థాయ్‌లాండ్‌లో పర్యటించి, ప్రధాని పేటోంగ్టార్న్‌తో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 4న బ్యాంకాక్‌లో జరగనున్న 'బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌' (BIMSTEC) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై వివిధ దేశాధినేతలతో చర్చించనున్నారు.

వివరాలు 

శ్రీలంకకు ప్రధాని మోదీ

థాయ్‌లాండ్‌ పర్యటన అనంతరం, ఏప్రిల్ 4న ప్రధాని మోదీ శ్రీలంకకు వెళతారు. ఏప్రిల్ 6 వరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిసనాయకే గతేడాది భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో, ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనను చేపట్టనున్నారు. శ్రీలంక పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై ప్రధానిగా మోదీ చర్చలు నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి