LOADING...
Kargil: కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన
ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన

Kargil: కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
08:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్గిల్‌లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు. ఇరాన్‌లో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా నినాదాలు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో వేలాది మంది గుమికూడి విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ విధానాలను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ప్రాంతంలో బాహ్య ప్రభావానికి తెరదించాలని వారు డిమాండ్ చేశారు.

vivaralu

భారత జెండాలతో పాటు ఇరాన్ జెండాలు 

నిరసనలో పాల్గొన్నవారు భారత జెండాలతో పాటు ఇరాన్ జెండాలను ఊపుతూ కనిపించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లతో ప్రతీకాత్మక శవపేటికలను రోడ్డుపై ఉంచి ప్రదర్శన చేశారు. ఇరాన్ దేశీయ, ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా-ఇజ్రాయెల్ జోక్యంపై తమ ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు. సభలో ప్రసంగించిన నేతలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ సమస్యలతో ఇరాన్‌లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో అక్కడి నాయకత్వానికి సంఘీభావం ప్రకటించారు. పశ్చిమ దేశాలు ఇరాన్‌ను అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ దేశ స్వాతంత్ర్యాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

ఇరాన్‌తో ఐక్యతను చాటడమే ఈ నిరసన ఉద్దేశం

ఇరాన్‌తో ఐక్యతను చాటడమే ఈ నిరసన ఉద్దేశం అని.. గ్లోబల్ శక్తుల అన్యాయ జోక్యానికి వ్యతిరేకంగా తమ గళం వినిపించడమేనని నిరసనకారులు చెప్పారు. నిరసన శాంతియుతంగా సాగిందని, దేశాల స్వాతంత్ర్యం, భౌగోళిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా, ప్రస్తుత పరిణామాల్లో ఇరాన్‌కు మద్దతుగా కార్గిల్‌లో ప్రజాభిప్రాయం బలంగా ఉందనడానికి ఈ భారీ హాజరు నిదర్శనమని స్థానిక నిర్వాహకులు తెలిపారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన

Advertisement