తదుపరి వార్తా కథనం
Deportation: అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదు: జై శంకర్
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2025
03:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ (డిపోర్టేషన్) కొత్తది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.
ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించడంపై కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు.
"అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోంది. 2009 నుంచి బహిష్కరణలు జరుగుతున్నాయి. భారత్ నుండి అక్రమ వలసలను అరికట్టేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా తిరిగి పంపించడమే మౌలిక విధానం. ఒక దేశానికి చెందిన ప్రజలు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు, వారిని తమ స్వదేశాలకు రప్పించడం ఆ దేశాల బాధ్యత" అని జైశంకర్ వివరించారు.