Page Loader
ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత 
ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత

ఉస్మానియా యూనివర్సిటీ 16వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి నవనీత్ రావు కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ పూర్వ ఉపకులపతి డా.న‌వ‌నీత రావు(95) కన్నుమూశారు. 1985-1991 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి గా నవనీతరావు పని చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్(IPE) డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన మరణించారన్న సమాచారం అందుకున్న ప్రొఫెసర్లు, విద్యార్థులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో, 24 మంది విద్యార్థులు వారి Ph.D పట్టా పొందారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లలో పరిశోధనా పత్రాలను సమర్పించడానికే కాకుండా టీచింగ్ అసైన్‌మెంట్‌పై కూడా అతను యూరప్, యుఎస్ఎ, మొదలైన దేశాలను సందర్శించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post