Suresh Kalmadi: ప్రముఖ రాజకీయ నేత సురేష్ కల్మాడీ ఇక లేరు.. రాజకీయ వర్గాల్లో విషాదం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) మంగళవారం తుదిశ్వాస విడిచారు. పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో సురేష్ కల్మాడీ బాధపడుతున్నారని సమాచారం. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Details
పలువురు ప్రముఖుల సంతాపం
సురేష్ కల్మాడీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పూణే ఎరందవనే ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం 'కల్మాడీ హౌస్'లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం, మధ్యాహ్నం 3:30 గంటలకు పూణే నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో సురేష్ కల్మాడీకి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.