ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ప్రచార ఉద్యమం..ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేయనున్న ఆప్
ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేసేలా దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేయాలని ఆప్ పిలుపునిచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల సర్వీసులపై పట్టు బిగించే ఆర్డినెన్స్ ప్రతులను ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ దగ్ధం చేస్తారు. ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కోత విధిస్తూ మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తమ పోరాటానికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ విపక్ష నేతలను కలిసి కోరనున్నారు.
కాంగ్రెస్ మద్దతు లేకుండా బిల్లును ఓడించడం ఆసాధ్యం
ఆర్డినెన్స్‌పై అనేక బీజేపీయేతర పార్టీలు ఆప్‌కి మద్దతు ఇస్తుండగా, కాంగ్రెస్ ఇంకా వ్యవహారంపై స్పందించట్లేదు. ఎగువ సభలో ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతును ఆప్ కోరనుంది. 31 మంది సభ్యులతో రాజ్యసభలో కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. కాంగ్రెస్ మద్దతు లేకుండా బిల్లును ఓడించడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పొచ్చు. ఈ అర్డినెన్స్ దేశ సమాఖ్య వ్యవస్థకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని క్రేజీవాల్ చెబుతున్నారు. అయితే పట్నా భేటీలో కాంగ్రెస్ మద్దతును ఆప్ కోరగా ఇరు పార్టీలు ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు.