Page Loader
YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్
జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్

YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, ఆమె సోదరుడు వైఎస్ జగన్‌పై రాజకీయ విమర్శలు చేసేది చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో ఆస్తి పంపకాలపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలు ఇప్పటికే సంచలనాలను సృష్టించాయి. ఇటీవల మరో వివాదం పలు పత్రికల్లో హల్‌చల్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్ దాఖలు చేశారు.

Details

ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ

సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్ ఈ చర్యకు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టీలో నమోదైన ఈ కేసు కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేశారు. ఈ కేసులో ఇతర ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చగరి జనార్థన్ రెడ్డి, యశ్వనాథ్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెన్స్ తెలంగాణ పేర్లు చేర్చారు. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో తమ పాత్ర కీలకమని జగన్ తన పిటిషన్‌లో వివరించారు.

Details

ప్రతివాదులకు నోటీసులు జారీ

2019 ఆగస్టు 21న షర్మిలకు వాటాలు కేటాయించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశామన్నారు. అయితే వాటా కేటాయింపు ఇంకా ఖరారుకాకపోవడం, ఇఖ షర్మిలతో జరిగిన రాజకీయ విభేదాలు కారణంగా ఈ వివాదం ఉద్భవించిందని పిటిషన్‌లో వెల్లడించారు. ఎన్‌సీఎల్‌టీ ఈ పిటిషన్‌ను స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2024 నవంబర్ 8కి షెడ్యూల్ చేశారు. ఈ కేసు దాఖలు కావడంతో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌తో పాటు వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత బలం చేకూర్చాయి.