LOADING...
Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో
భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో

Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఒప్పందానికి సంబంధించి మరిన్ని చర్చలు జరిపేందుకు త్వరలోనే అమెరికా ప్రతినిధి బృందం భారత్‌కు రానుందని తెలిపారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోతో సమావేశమైన అనంతరం ఢిల్లీలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలోని కొన్ని అంశాలపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని జైశంకర్ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వివరాలు

భారత్, అమెరికా కలిసి ముందుకు సాగుతాయి

ఇదే సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంగా గురించి కూడా చర్చించినట్లు మార్కో రూబియో వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, అమెరికా కలిసి ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్‌లో పర్యటించడం గర్వంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement