LOADING...
PT Usha: పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత

PT Usha: పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు,రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శ్రీనివాసన్ తన ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే శ్రీనివాస్ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు.

వివరాలు 

1991లో పీటీ ఉషతో వివాహం

శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. క్రీడాకారుడు కూడా అయిన ఆయన 1991లో పీటీ ఉషను వివాహం చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ కుమారుడు ఉన్నాడు. పీటీ ఉష నడిపే ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (Usha School of Athletics) అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక భూమిక పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మరణంపై పలువురు క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పీటీ ఉష సాధించిన ప్రతీ విజయానికి ఆయన నిరంతర ప్రోత్సాహం, మద్దతే కీలకమైనదని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్ 

Advertisement