LOADING...
Puja Khedkar: డ్రైవర్‌ కిడ్నాప్‌ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్‌ తల్లిదండ్రులు
డ్రైవర్‌ కిడ్నాప్‌ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్‌ తల్లిదండ్రులు

Puja Khedkar: డ్రైవర్‌ కిడ్నాప్‌ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్‌ తల్లిదండ్రులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

నవీ ముంబయిలో ట్రక్క్ డ్రైవర్‌ కిడ్నాప్‌ కేసు మరో మలుపు తిరిగింది.అతడిని కిడ్నాప్‌ చేసింది మాజీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ తండ్రి దిలీప్‌ ఖేడ్కర్‌ అని తేలింది డ్రైవర్‌ను పోలీసులు రక్షించడానికి ప్రయత్నించగా, దిలీప్‌ ఖేడ్కర్‌ భార్య మనోరమ ఖేడ్కర్‌ పోలీసుల పైకి కుక్కలను ఉసిగొల్పారు. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. సెప్టెంబర్‌ 13న ఒక ఘటనలో, దిలీప్‌ ఖేడ్కర్‌ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత దిలీప్‌, ఆయన బాడీగార్డు ప్రఫుల్ల్‌, ట్రక్క్ డ్రైవర్‌ ప్రహ్లాద్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత పోలీసులు డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామనే నెపంతో అతడిని 150 కిలోమీటర్ల దూరంలోని పుణెకు తీసుకెళ్లారు.

వివరాలు 

మనోరమపై కేసు నమోదు

"తనను బలవంతంగా పుణెలోకి తీసుకెళ్తున్నారు" అని ట్రక్క్ డ్రైవర్‌ తన యజమానికి ఫోన్‌లో తెలియజేశాడు. దీన్ని తెలుసుకున్న ట్రక్క్ యజమాని వెంటనే పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు. విచారణలో, పోలీసులు వాహన నంబర్ ఆధారంగా పుణెలోని ఖేడ్కర్‌ కుటుంబ నివాసానికి చేరారు. ఈ సమయంలో పూజా ఖేడ్కర్‌ తల్లి మనోరమ ఖేడ్కర్‌ వారిని అడ్డుకున్నారు. గేటు తెరవడానికి నిరాకరించడంతోపాటు, పోలీసులపై కుక్కలను ఉసిగొల్పారు. చివరకు పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు వారి ఇంటి పరిసరాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారనే కారణంతో మనోరమపై కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను పోలీసులు రక్షించగలిగారు.

వివరాలు 

 పరారీలో  ఖేడ్కర్‌ దంపతులు 

పూజా ఖేడ్కర్‌ కుటుంబసభ్యుల తీరు వివాదాస్పదం కావడం ఇదేమీ తొలిసారి కాదు. తప్పుడు ఓబీసీ, దివ్యాంగ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్‌ యూపీఎస్సీ లో ఉద్యోగం పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత తోటి అధికారితో గొడవ పడిన కారణంగా, ఆమె ధ్రువపత్రాల విచారణ జరగడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. అలాగే, మనోరమ ఖేడ్కర్‌ గతంలో ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ కారణంగా కుటుంబంపై దాడి, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తాజాగా, దిలీప్‌ ఖేడ్కర్‌పై కిడ్నాప్‌ కేసు నమోదయిన తరువాత, దంపతులిద్దరూ పరారీలో ఉన్నారు.