Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయానికి పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు జగద్గురు తుకారామ్ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను కేంద్రానికి ఆమోదం కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. పుణెలోని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మహోల్ ఈ ప్రతిపాదనను రూపొందించగా, శిందే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం దీనికి మద్దతు తెలిపింది. దీనితో, మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్టు పెట్టింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం తనకు ఆనందాన్ని కలిగించిందని మురళీధర్ మహోల్ తెలిపారు.