Pune: పూణె -దిల్లీ ఇండిగో విమానంలో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడిన మహిళ
పూణె నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు సహ ప్రయాణికులను కొట్టి, సెక్యూరిటీ గార్డును కొరికిన వింత ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం 7:45 గంటలకు ఇండిగో విమానం పూణెలోని లోహెగావ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరబోతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడే ఆ మహిళ వీరంగం సృష్టించింది. మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దించి పుణె పోలీసులకు అప్పగించారు.
అసలు విషయం ఏమిటి?
నిందితురాలైన మహిళ,ఆమె భర్త ఢిల్లీకి వెళ్లేందుకు విమానం ఎక్కారు, ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై ఆ మహిళ దాడి చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, ఐఎస్‌ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై ని చెంపదెబ్బ కొట్టి చేయి కొరికింది. ఆతర్వాత నిందితురాలిని, ఆమె భర్తను అధికారులు విమానం నుంచి కిందకు దింపేశారు.
ఆ మహిళ డిప్రెషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు
నిందితురాలిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. , ఆ తర్వాత ఆ జంటను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంటకు నోటీసులు ఇచ్చి విడిచిపెట్టినట్లు వెల్లడించారు. . మహిళ గృహిణి అని, ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని పోలీసులు తెలిపారు. దగ్గరి బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇద్దరూ ఢిల్లీకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, మహిళతో ప్రయాణించేందుకు పైలట్ నిరాకరించడంతో.. ఆమెను విమానం నుంచి దింపేసినట్లు వెల్లడించారు.