LOADING...
Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు

Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. దిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా బారికేడ్లు, కాంక్రీట్ స్లాబ్‌లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. సరిహద్దులను మూసివేసినందున, దాదాపు 6 నెలలకు సరిపోయేంత రేషన్, డీజిల్‌తో ట్రాక్టర్లరో పంజాబ్ రైతులు సరిహద్దుకు చేరుకున్నారు. ఎన్నిరోజులైనా సరిహద్దు వద్ద వేచి చూస్తామని రైతులు, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేసుకున్నామని చెబుతున్నారు. 2020లో రైతుల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు దిల్లీ సరిహద్దులో చేసిన నిరనసలకు ఇది కొనసాగింపే అని రైతులు అంటున్నారు.

రైతు

సూది నుంచి సుత్తి వరకు అన్ని పనిముట్లను తెచ్చుకున్నాం: పంజాబ్ రైతు

రేషన్, డీజిల్‌ మాత్రమే కాకుండా అనేక సామగ్రిని తమ వెంట తెచ్చుకున్నట్లు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన రైతు హర్భజన్ సింగ్ తెలిపారు. బారీకెడ్లు, కాంక్రీట్ స్లాబ్‌లు, ముళ్ల తీగలను పగలగొట్టేందుకు సూది నుంచి సుత్తి వరకు అన్ని పనిముట్లను తాము తెచ్చుకున్నట్లు వెల్లడించారు. దాదాపు ఆరు నెలలకు సరిపోయేలా రేషన్‌తో తమ గ్రామం నుంచి బయలుదేరినట్లు పేర్కొన్నారు. హర్యానాకు చెందిన తమ సోదరులకు కూడా తగినంత డీజిల్‌తో సరిహద్దుకు వచ్చినట్లు చెప్పారు. 2020 రైతుల నిరసనలో తాను పాల్గొన్నట్లు తెలిపిన హర్భజన్ సింగ్.. ఈసారి మాత్రం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విరమించబోమని చెప్పారు.