LOADING...
పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు
పట్టాలపై పడుకుని నిరసనలు

పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 28, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ మేరకు తమ సమస్యలు తీర్చాలని 18 రైతు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 రోజుల పాటు ఈ రైల్ రోకో ఆందోళన కొనసాగించనున్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. పలు రైళ్ల మార్గాలను మళ్లించింది. ఇంకొన్నింటినీ కుదించింది. మరోవైపు పంజాబ్ రైతులు అమృత్‌సర్‌లోని దేవిదాస్‌పురాలో 'రైల్-రోకో' నిరసన చేస్తున్నారు. రైతు కూలీల రుణాలను సంపూర్ణణంగా మాఫీ చేయాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.

DETAILS

సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం : రైతు నేతలు

స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు. మరోవైపు రైతు ఉద్యమంలో మరణించిన పంజాబీ కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తేల్చి చెప్పారు. వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సైతం పరిహారాన్ని అందించాలన్నారు. తక్షణమే ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని తాము పట్టిబట్టినట్లు చెప్పారు. MNREGA కింద ఏటా 200 రోజులు ఉపాధిని తప్పనిసరిగా కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అమృత్‌సర్‌లోని దేవిదాస్‌పురాలో 'రైల్-రోకో' నిరసన