Purnima Devi Barman: టైమ్ మ్యాగజైన్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పూర్ణిమా దేవీ బర్మాన్ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి చెందిన ప్రముఖ జీవశాస్త్ర నిపుణురాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి పూర్ణిమాదేవి బర్మాన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 'విమెన్ ఆఫ్ ది ఇయర్' (Women of the Year) జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 13 మంది మహిళల పేర్లు ఉన్నాయి. అందులో భారతదేశం నుండి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్ కావడం విశేషం.
వివరాలు
పూర్ణిమ గురించి..
అస్సాంకు చెందిన 45 ఏళ్ల పూర్ణిమ చిన్నతనం నుంచే ప్రకృతి, పక్షులపై మక్కువ కలిగి ఉన్నారు.
ఆ ఆసక్తితోనే జువాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం, గ్రేటర్ అడ్జటెంట్ అనే అరుదైన కొంగ జాతిపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఆ కొంగలు అంతరించిపోతున్నాయనే విషయాన్ని గ్రహించి, వాటి సంరక్షణ కోసం కృషి చేయాలని నిశ్చయించుకున్నారు.
దాని భాగంగా 2007లో కొంతమంది మహిళలతో కలిసి 'హర్‌గిలా' బృందాన్ని స్థాపించారు.
వివరాలు
'హర్‌గిలా ఆర్మీ'లో సుమారు 20,000 మంది మహిళలు
ప్రస్తుతం 'హర్‌గిలా ఆర్మీ'లో సుమారు 20,000 మంది మహిళలు ఉన్నారు.
ఈ బృందం ప్రజలకు కొంగల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ, అస్సాం సంప్రదాయ దుస్తులపై కొంగ బొమ్మలను వేస్తూ వాటిని పర్యాటకులకు విక్రయిస్తుంది.
దీని ద్వారా స్థానిక మహిళలకు జీవనోపాధిని కల్పించారు. పూర్ణిమాదేవి చేసిన సేవలు అస్సాంకు మాత్రమే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించాయి.
అంతేకాదు, కంబోడియా, ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో ఆమె చేసిన పనులను విద్యార్థులకు బోధిస్తున్నారు.