
Manmohan Singh: ఆర్బీఐ గవర్నర్ నుండి రాజకీయాల్లోకి..మన్మోహన్ సింగ్ ప్రస్థానం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు.
ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా చేసిన నిర్ణయాలతో భారత్‌ను ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా అవతరింపజేశారు.
1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన బడ్జెట్ ప్రసంగంలో "ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించాలి" అనే ఆలోచన ప్రాచుర్యం పొందింది.
ఆర్థిక వ్యవస్థను సరళీకరించడమే కాకుండా, భారత్‌ను ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
వివరాలు
ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ
ఆర్థికవేత్తగా,విద్యావేత్తగా మన్మోహన్ సింగ్ అనేక రంగాలలో తన ముద్రను వేశారు.
1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పీవీ నరసింహా రావు ఆయనను ఆర్బీఐ గవర్నర్ నుండి నేరుగా క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చోటు కల్పించారు.
ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు.
ఈ సంస్కరణలతో మనం ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించడమే కాకుండా,భారత్ ఆర్థిక వృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలబడింది.
1992లో పీవీనరసింహా రావు,మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశం ప్రపంచంలో తన స్థానాన్ని మెరుగుపర్చేందుకు మార్గం కల్పించాయి.
2004 నుంచి 2014వరకు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నప్పుడు అనేక కొత్త సంస్కరణలు అమలు చేసారు.
వివరాలు
గురువుకు తగ్గ శిష్యుడిగా..
ఆయన పాలనలో పేదరికాన్ని తగ్గించేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
అలాగే, పారదర్శక పాలన కోసం సమాచార హక్కు చట్టం కూడా ఆయన తీసుకొచ్చారు.
2008లో భారతదేశం-అమెరికా అణు ఒప్పందంపై మన్మోహన్ సింగ్ సంతకం చేశారు.
ఈ ఒప్పందం భారతదేశానికి అణు మార్కెట్లోకి ప్రవేశించే మార్గాన్ని తెరిచింది.
ఒప్పందాన్ని వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నా, మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు, దేశ ప్రయోజనాలను ముందుండి నిలబెట్టారు.
అలా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్‌సింగ్ పేరు తెచ్చుకున్నారు.