Qatar: భారత నేవీ మాజీ సిబ్బందికి ఊరట ..శిక్ష తగ్గించిన ఖతార్ కోర్టు
గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి గత నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం తెలిపింది. దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్‌లోని అప్పీల్ కోర్టు మరణశిక్షలను తగ్గించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, కోర్టు ఏమి చెప్పిందో పేర్కొనలేదు,ఈ విషయంలో వివరణాత్మక తీర్పు కోసం వేచి ఉంది. ఖతార్ లోని డిఫెన్సె సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీలో పని చేస్తున్న 8మంది రిటైర్డ్ ఇండియన్ నేవి సిబ్బందిని 2022లో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఖతార్ కోర్టు వీరికి ఈ ఏడాది అక్టోబర్ 26న మరణశిక్ష విధించింది.తాజాగా ఆ శిక్ష తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.