తదుపరి వార్తా కథనం

Kakani Govardhan: క్వార్ట్జ్ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 25, 2025
08:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, అలాగే నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించి ఆయనపై ఫిబ్రవరిలో పొదలకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులో గోవర్దన్‌రెడ్డి కొంతకాలంగా పరారీలో ఉండగా, కేరళలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
రేపు ఉదయం ఆయనను నెల్లూరుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.