
Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు రద్దైన ప్రశ్నోత్తరాలను, తాజాగా సోమవారం మూడోసారి రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో, ఈ సెషన్‌లో మూడుసార్లు ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లైంది.
దీనిపై బీఆర్‌ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుందని, అందుకే ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం దీనిపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
Details
ప్రజా సమస్యలు చర్చకు రావాలంటే ప్రశ్నోత్తరాలు తప్పనిసరి
తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలు చర్చకు రావాలంటే ప్రశ్నోత్తరాలు తప్పనిసరి అని వారు అభిప్రాయపడ్డారు.
సోమవారం అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై చర్చ జరగనుంది.