Ameen Sayani: ప్రఖ్యాత రేడియో అనౌన్సర్ అమీన్ సయానీ కన్నుమూత
ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ మంగళవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు.ఆయనకు 91 ఏళ్లు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను సమీపంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందినట్టు ఆయన కుమారుడు రాజిల్ సయానీ వెల్లడించారు. అమీన్ సయానీ చాలా సంవత్సరాలు రేడియోలో 'బెహ్నో ఔర్ భాయియో, అగ్లీ పైదాన్పే హై యే గానా...' అంటూ బినాకా పాటల షోకు వ్యాఖ్యానించేవారు.
2009లో పద్మశ్రీ పురస్కారం
అమీన్ సయానీ వాయిస్ ఓవర్లు మాత్రమే కాకుండా అనేక మంది గాయకులు, పాటల రచయితలు,సంగీతకారులను ఇంటర్వ్యూ చేసేవారు. 1932లో ముంబైలో జన్మించిన అమీన్ సయానీ ఆంగ్లంలో అనౌన్సర్‌గా ఆకాశవాణిలో తన కెరీర్‌ను ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అయన హిందీలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బినాకా గీత్మాల కార్యక్రమంతో ఎంతో పాపులర్ అయ్యారు.దాదాపు19,000 జింగిల్స్‌కు వాయిస్ అందించినందుకు గాను లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో సయానీ చోటు దక్కించుకున్నాడు. 2007లో ఆయనకు హిందీ రత్న పురస్కరాం అందజేశారు. 2009లో పద్మశ్రీ పురస్కారం సైతం లభించింది.