Loading...
Rahul Gandhi: ఓటు చోరీపై నిరసన వాయిదా వేయాలన్న వ్యాపారులు.. రాహుల్ ఏమన్నారంటే!
ఓటు చోరీపై నిరసన వాయిదా వేయాలన్న వ్యాపారులు.. రాహుల్ ఏమన్నారంటే!

Rahul Gandhi: ఓటు చోరీపై నిరసన వాయిదా వేయాలన్న వ్యాపారులు.. రాహుల్ ఏమన్నారంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఓటు చోరీ'కి వ్యతిరేకంగా నవంబరు 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'ఇండియా' కూటమి నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని స్థానిక వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. దీపావళి పండగ సీజన్‌లో వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశాయి. దీనిపై రాహుల్ గాంధీ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

వివరాలు 

30 సెకన్లలోనే ఈ నిరసనలన్నీ ఆగిపోతాయి: రాహుల్ 

దిల్లీలోని వ్యాపారుల సమస్యలను తాము అర్థం చేసుకుంటున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.

అయితే, మెట్రో సేవలను ప్రభుత్వమే నిలిపివేసిందని, రహదారులను కూడా మూసివేసి దేశ రాజధానిని లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఉంచిందని విమర్శించారు.

ఓట్లనే దొంగిలిస్తే ప్రజల దుకాణాలు, పొదుపు సొమ్ము, పిల్లల భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉండవని పేర్కొన్నారు.

"ప్రధాని నరేంద్ర మోదీతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని చెప్పండి. అప్పుడు 30 సెకన్లలోనే ఈ నిరసనలన్నీ ఆగిపోతాయి" అని రాహుల్ గాంధీ వ్యాపారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

నిరసన కారణంగా దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపారం దెబ్బతినే అవకాశం 

దీపావళి సమయంలో దిల్లీలో పెద్దఎత్తున వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) తెలిపింది.

ఈ నేపథ్యంలో నవంబరు 1న రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన వల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నిరసన కారణంగా దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపారం దెబ్బతినవచ్చని అంచనా వేసింది.

దీంతో నిరసన కార్యక్రమాన్ని నవంబరు 10 తర్వాత నిర్వహించాలని కోరుతూ సీటీఐ ప్రతినిధులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

దీపావళి పండగ సమయంలో వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా నిరసన తేదీని మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT