
Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం: రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల వచ్చిన నిరుద్యోగమే కారణమన్నారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలోని పౌరులకు ఉపాధి లభించడం లేదని, నిరుద్యోగమే భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ అన్నారు.
దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమన్నారు. మోదీ జీ విధానాల వల్ల భారతదేశ ప్రజలకు ఉపాధి లభించడం లేదన్నారు.
ప్రధానమంత్రి విధానాల వల్ల నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కూడా పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ గాంధీ అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi on Loksabha security breach:
— Shantanu (@shaandelhite) December 16, 2023
Why did this happen?
Due to Modi’s policy, there are massive unemployment in the country… pic.twitter.com/bS17K0O26m