Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని, ఆయన తలపై కేంద్రం రివార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత వారం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ- సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా.. వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే వాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు.
రవ్‌నీత్‌సింగ్ బిట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్
అన్ని మతాలకు ఇదే పరిస్థితి తప్పడం లేదనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఖలీస్తాన్ మద్దతుదారులు సపోర్ట్ గా నిలవగా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.