Page Loader
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్

వ్రాసిన వారు Stalin
Feb 20, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లోని స్థానిక కోర్టులో మంగళవారం రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ 2018లో హోంమంత్రి అమిత్ షాపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యను పరువు నష్టం కేసుగా పేర్కొంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా కేసు రాహల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచరారించిన ధర్మానసం రాహుల్ గాంధీకి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది.

రాహుల్

యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర 

రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. మంగళవారం రాహుల్ కోర్టుకు హాజరుకావడంతో ఈ యాత్ర కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. అంతకుముందు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ నరేష్ మాట్లాడుతూ.. 'పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్ స్థానిక కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున, మంగళవారం ఉదయం భారత్ జోడో న్యాయ్ యాత్ర కొంతకాలం ఆగుతుందని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు దొరికితే గరిష్ఠంగా రెండేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని విజయ్ మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ కుమార్ పాండే తెలిపారు.