
Rahul Gandhi: బెంగాల్‌లో రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి.. ధ్వంసమైన కారు అద్దాలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేప్పట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది.
ఈ రోజు మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు.ఈ దాడిలో కారు వెనుక అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి.
దింతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ దాడి నుండి రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడ్డారు.
Details
'జోనోసంజోగ్ యాత్ర'ను ప్రారంభించనున్న మమతా బెనర్జీ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బుధవారం మాల్డాలోని ఇంగ్లీష్ బజార్‌లో తన 'జోనోసంజోగ్ యాత్ర'ను ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా రెండు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
రాహుల్ గాంధీ బుధవారం తన భారత్ జోడో న్యాయ్ యాత్రను బీహార్‌లోని కతిహార్ జిల్లాలో రోడ్‌షోతో తిరిగి ప్రారంభించారు.
మాల్దా జిల్లాలోని దేబీపూర్, రతువా మీదుగా యాత్ర మళ్లీ బెంగాల్‌లోకి ప్రవేశించింది. బెంగాల్‌లో తొలి దశ యాత్ర సోమవారంతో ముగిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి దృశ్యాలు
STORY | Rahul Gandhi's car 'pelted with stones' during Congress yatra in Bengal: Adhir Ranjan Chowdhury
— Press Trust of India (@PTI_News) January 31, 2024
READ: https://t.co/1gEDXZJJPY
VIDEO: pic.twitter.com/Mi44AqNeBq