
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తంచేశారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో విజయం సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు.
అయితే రాజస్థాన్‌లో గెలుపునకు తమ పార్టీ చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని రాహుల్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం లేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో మిగిలి రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణలో బీజేపీ పని అయిపోంది: రాహుల్ గాంధీ
BJP is finished in Telangana - India's next Pm Rahul Gandhi pic.twitter.com/XMB36oh1Ak
— Anshuman Sail Nehru (@AnshumanSail) September 24, 2023