Rahul Gandhi: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్, కమలా హారిస్‌లకు రాహుల్ గాంధీ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్రంప్, కమలా హారిస్ కు అభినందనలతో లేఖ రాశారు.
"అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. భవిష్యత్తులో ప్రజలు మీ విజన్ పై నమ్మకం ఉంచారు. ప్రజాస్వామ్య విలువలపట్ల మన దేశాల నిబద్ధత ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింత బలపరుస్తోంది. మీ నాయకత్వంలో ఇరుదేశాల సంబంధాలు పరస్పర ప్రయోజనాల కోసం మరింత బలపడతాయని ఆశిస్తున్నాం," అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
వివరాలు
భారత్-అమెరికా సహకారం మరింత బలపడుతుంది
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కు సైతం రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.
"అధ్యక్ష ఎన్నికల్లో మీరు చేసిన కృషి ప్రశంసనీయం. అందరినీ ఏకం చేయాలనే మీ సందేశం స్ఫూర్తిదాయకం. జో బైడెన్ పరిపాలనలో భారత్-అమెరికా సహకారం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువలపై మన భాగస్వామ్య నిబద్ధత ఇరుదేశాల మధ్య దృఢమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది," అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.