Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించడం అవసరమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ చర్య కీలకమని చెప్పారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు కావాల్సిన చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని కాంగ్రెస్, ఇండియా కూటమి కృషి చేస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, దీనికి ఎలాంటి ప్రతిబంధకం ఉండదని రాహుల్ స్పష్టం చేశారు.
90శాతం మందికి తగిన అవకాశాలు లేవు
దేశ జనాభాలో 90 శాతం మంది తగిన అవకాశాలు పొందడం లేదన్నారు. అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారుల్లో 90 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారేనని చెప్పారు. దేశ బడ్జెట్‌ను నిర్ణయించే స్థాయిలో కూడా సమాన ప్రాతినిధ్యం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.