Nadda on Rahul: రాహుల్‌పై నడ్డా నిప్పులు.. చరిత్ర గురించి అవగాహన లేదని మండిపాటు
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రపై అవగాహన లేని వ్యక్తిగా అభివర్ణించారు.
తన తండ్రి, నానమ్మ, ముత్తాతలు రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని చేసిన ప్రయత్నాలను రాహుల్‌కు తెలియదని ఆరోపించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా, 65 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం, దాని స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
నడ్డా, రాహుల్ గాంధీ రాసి ఇచ్చిన స్పీచ్‌లను మాత్రమే చదువుతారు, వారు చరిత్రను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Details
రాహుల్ కు అవగాహన లేదు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, రాజ్యాంగాన్ని ఎవరు మార్చారు, ఎవరు రక్షించారు, ప్రాథమిక నిబంధనలను ఎవరు నాశనం చేశారనే విషయాలను గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగం మార్పు కోసం చేసిన ప్రయత్నాలను కూడా రాహుల్‌కు తెలియదని అన్నారు.
ఆయన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)లను అంబేడ్కర్ వ్యతిరేకించినా మొదటి ప్రధాని నెహ్రూ అమలు చేసినట్లు పేర్కొన్నారు.