త్వరలో కాశ్మీర్‌లో వందే భారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కాశ్మీర్ లోయలో త్వరలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. జమ్ము-శ్రీనగర్ లైన్ ఫంక్షనల్ అయిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీనగర్‌లో వందే భారత్ సేవలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు వైష్ణవ్ చెప్పారు. జమ్ము-శ్రీనగర్ రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తయితే వందే భారత్ రైలు పరుగులు పెట్టనుందని వైష్ణవ్ వార్తా సంస్థ PTI కి చెప్పారు. వందే భారత్ రైళ్లు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండడటం వల్ల ఎత్తయిన,వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయని వైష్ణవ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రంలో రైలు మార్గం విద్యుదీకరణ పనులు తర్వాత త్రిపుర ప్రజలకు కూడా సెమీ-హై స్పీడ్ రైలు సేవలందిస్తుందని మంత్రి చెప్పారు.